Anu Emmanuel: అను క్రష్ ఎవరో తెలుసా?
తనకు ఎవరంటే క్రష్ ఉందో బయటపెట్టింది అను ఎమ్మాన్యుయేల్. ఆ అందగాడి పేరు ఏంటో తెలుసా?

Anu Emmanuel
హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ పై ఆ మధ్య చాలా పుకార్లు షికార్డు చేశాయి. ఆమె ఎవరితోనో డేటింగ్ చేస్తోందని, త్వరలోనే తన లవ్ మేటర్ ను బయటపెడుతుందని కూడా కథనాలు వచ్చాయి. అయితే వాటిపై ఎప్పుడూ అను ఎమ్మాన్యుయేల్ స్పందించలేదు. తాజాగా తన క్రష్ గురించి మాత్రం ఈమె బయటపడింది.
ఇప్పటికీ ఎప్పటికీ తనకు హృతిక్ రోషన్ అంటే ఇష్టమని ప్రకటించింది అను ఎమ్మాన్యుయేల్. తనకు లైఫ్ లాంగ్ క్రష్ గా హృతిక్ నిలిచిపోతాడని చెప్పుకొచ్చింది. ఇక ఫేవరెట్ హీరో విషయానికొస్తే, బన్నీ అంటే తనకు చాలా ఇష్టమని ప్రకటించింది ఈ బ్యూటీ.
ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటోంది అను ఎమ్మాన్యుయేల్. ఆ ప్రచారంలోనే ఈ సంగతులు బయటపెట్టింది. ఈ సందర్భంగా డేటింగ్ పై వచ్చిన ప్రశ్నల్ని తనదైన శైలిలో తిప్పికొట్టింది. తను ప్రేమలో ఉన్నానా లేదా అనే విషయం తనకు కూడా తెలియదంటూ తప్పించుకుంది.