Telugu Global
Cinema & Entertainment

Anu Emmanuel: రెగ్యులర్ సినిమాలకు దూరం

అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తోంది అను ఎమ్మాన్యుయేల్. దీనిపై స్పందిస్తే ఏదీ మన చేతిలో లేదని సమాధానం చెబుతోంది.

Anu Emmanuel: రెగ్యులర్ సినిమాలకు దూరం
X

అను ఎమ్మాన్యుయేల్.. టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ఈ విషయాన్ని ఆమె అంగీకరించడం లేదు. రెగ్యులర్ సినిమాలకు తను కావాలనే దూరమయ్యానని అంటోంది.

"నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్‌ కాదు. కాకపోతే వరుసగా సినిమాలు చేయడం లేదు. నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఫెయిల్‌ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్‌ సంపాదించుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్‌ చూశాక నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నా. వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూట్‌ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. ఏదో వచ్చాం... చేశాం.. వెళ్లాం అనుకునే పద్దతిలో లేను."

ఈ సందర్భంగా ఒకింత వేదాంతాన్ని కూడా ఒలికించింది అను. మంచి కథ ఎంచుకోవడం, పాత్రకు న్యాయం చేయడం వరకే తన చేతిలో ఉందని, దర్శకుడు చెప్పింది చేయడం, డైలాగ్‌ చెప్పడం వరకే తన పని అని, సక్సెస్ తన చేతిలో లేదని చెబుతోంది.

ఆమె నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా రేపు థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో సింధు అనే పాత్రలో నటించింది అను. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుందని చెబుతోంది.

First Published:  3 Nov 2022 1:00 PM IST
Next Story