Telugu Global
Cinema & Entertainment

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. ఆయన భార్య షాకింగ్ కామెంట్స్

జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన భార్య అయేషా ఫిర్యాదు చేసింది.

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. ఆయన భార్య షాకింగ్ కామెంట్స్
X

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన సతీమణి అయేషా ఫిర్యాదు చేసింది. నా భర్తను ఆమె ప్రేమ, మ్యారేజ్ పేరుతో టార్చర్ పెట్టుందని భాదితురాలు సూసైడ్ అంట్డెడ్ చేసిందని జానీ భార్య ఆరోపించింది. బాధితురాలి తల్లి కూడా వేధించిందని నాకు, పిల్లలకు ఏమైనా జరిగిన వారిదే బాధ్యత నాకు న్యాయం చేయండని అయేషా కంప్లేంట్‌లో పేర్కొన్నారు. సదరు యువతి తన భర్త జానీని ట్రాప్ చేసిందని ఆవేదనను వెలిబుచ్చింది. ప్రేమ పేరుతో ఆ అమ్మాయి ప్రతిక్షణం వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు.

ఐదేళ్లు నరకం అంటే ఏమిటో జానీ మాస్టర్‌తో పాటు తనకు కూడా చూపించిందని ఆరోపాణలు చేసింది. చివరకు ఆమె భాధ తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యకు యత్నించానని తెలిపింది. లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు ఇచ్చిన అమ్మాయి, ఆమె పేరేంట్స్ వివాహం చేసుకోవాలంటూ తన భర్తను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని ఆమె తెలిపింది. అలా వేధింపులు భరించలేకే వారిని కొంతకాలంగా జానీ మాస్టర్ దూరం పెట్టారని, ఆ కక్షతోనే తన భర్తపై అక్రమంగా కేసు పెట్టారని సుమలత వాపోయింది. మరోవైపు జానీ మాస్టర్ 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది.

First Published:  28 Sept 2024 11:02 AM IST
Next Story