Telugu Global
Cinema & Entertainment

ఆర్జీవీకి మరో షాక్..ఆ డబ్బులన్నీ వడ్డీతో సహా కట్టాలి

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది.

ఆర్జీవీకి మరో షాక్..ఆ డబ్బులన్నీ వడ్డీతో సహా కట్టాలి
X

ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. 2022లో విడుదలైన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ గ్రిడ్ లీగల్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్‌లో వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందడంతో ఆర్జీజీతో పాటు మరో ఐదుగురికి సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా తీసుకున్న డబ్బులు వెనక్కి కట్టాలని ఆదేశించింది. అయితే అప్పటి ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. రూ.11 వేల చొప్పున తీసుకున్నారు. దీంతో వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందటం పై లీగల్ నోటీసులుపంపింది. ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీ‌తో సహా ఐదుగురుకి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీ తో సహా మొత్తం కట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

First Published:  21 Dec 2024 4:58 PM IST
Next Story