Telugu Global
Cinema & Entertainment

మరో డిఫరెంట్ మూవీ రాబోతోందన్నమాట

బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా. చైతన్యరావు హీరో.

మరో డిఫరెంట్ మూవీ రాబోతోందన్నమాట
X

కొన్ని నిర్మాణ సంస్థలు రెగ్యులర్ గా సినిమాలు తీయవు. అప్పుడుప్పుడు సినిమాలు తీసినా మంచి సినిమాలు వస్తుంటాయి. బిగ్ బెన్ మూవీస్ కూడా అలాంటిదే. ఇప్పుడీ బ్యానర్ నుంచి మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది.

"పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఓ పిట్ట కథ చిత్రంతో ప్రతిభవంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చెందు ముద్దు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నాడు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా,

దర్శకులు తరుణ్ భాస్కర్ కెమెరా స్విచాన్ చేశారు. మొదటి షాట్ కు దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.

గ్రామీణ నేపథ్యంతో సాగే సరికొత్త కథ ఇది. దాదాపు అంతా కొత్తవాళ్లే నటిస్తున్న ఈ సినిమాకు కథే ప్రాణం. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. అమలాపురం, అరకు ప్రాంతాల్లో దాదాపు నెల రోజులు షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత

సెప్టెంబర్ లో కేరళ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది.

First Published:  30 July 2022 9:50 AM IST
Next Story