Telugu Global
Cinema & Entertainment

Annapurna Photo Studio: బిగ్ బెన్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ

Annapurna Photo Studio: టాలీవుడ్ లోకి మరో డిఫరెంట్ స్టోరీ వస్తోంది. మంచి కథల్ని పిక్ చేసే బిగ్ బెన్ సినిమాస్ నుంచి ఈ మూవీ వస్తోంది.

Annapurna Photo Studio: బిగ్ బెన్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ
X

"పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ నుంచి మరో ఆసక్తికరమైన చిత్రం వస్తోంది. దీనికి అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే టైటిల్ ను ఖరారు చేశారు. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పిట్ట కథ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చెందు ముద్దు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

గ్రామీణ నేపథ్యంగా సాగే క్రైమ్ కామెడీ చిత్రమిది. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా అనౌన్స్ చేశారు. అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే టైటిల్, ఇచ్చట అందంగా ఫొటోలు తీయబడును అనే క్యాప్షన్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

80 దశకం నేపథ్యంలో ఒక ఊరిలో సాగే క్రైమ్ కామెడీ చిత్రమిది. ఇందులో పాత్రలన్నీ విభిన్నంగా సాగుతాయి. సినిమా మొత్తం ఓ ఫొటో స్టుడియో చుట్టూ తిరుగుతుంది. ఇప్పటి జీవితాల్లో కనిపించే సెల్ ఫోన్లు, మల్టీప్లెక్సులేవీ ఇందులో కనిపించవు.

సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

First Published:  28 Dec 2022 9:36 AM IST
Next Story