Telugu Global
Cinema & Entertainment

Anjali | వెబ్ సిరీస్ తో వస్తున్న అంజలి

Anjal - రీసెంట్ గా వచ్చిన సినిమాలతో ఫెయిల్ అయింది అంజలి. ఇప్పుడో వెబ్ సిరీస్ తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

Anjali | వెబ్ సిరీస్ తో వస్తున్న అంజలి
X

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.

విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గమనిస్తే.. మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు..

అలాంటి ప‌ల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వ‌స్తుంది. ఆమె వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డి పరిస్థితులు మారుతాయి. ఇంత‌కీ పుష్ప అక్క‌డికెందుకు వ‌చ్చింది.. ఊరి పెద్ద‌తో ఆమెకున్న రిలేష‌న్ ఏంటి? అమ్మాయిల‌ను ఆట‌వ‌స్తువులుగా చూసింది ఎవ‌రు? ఇలాంటి ఎన్నెన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం బ‌హిష్క‌ర‌ణ సిరీస్‌.

ట్రయిలర్ చూస్తుంటే, సిరీస్ లో వయొలెన్స్, రొమాన్స్ రెండూ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన 2 సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయిన అంజలి, కనీసం ఈ వెబ్ సిరీస్ తోనైనా హిట్ కొడుతుందేమో చూడాలి.

First Published:  12 July 2024 7:59 AM GMT
Next Story