Telugu Global
Cinema & Entertainment

Anjali | హిట్ కొట్టానంటున్న అంజలి

Anjali - రీసెంట్ గా బహిష్కరణ అనే వెబ్ సిరీస్ చేసింది అంజలి. అది పెద్ద హిట్టయిందని చెబుతోంది.

Anjali | హిట్ కొట్టానంటున్న అంజలి
X

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి తాజాగా ‘బహిష్కరణ’ అంటూ ప్రేక్షకులముందుకొచ్చింది. రీసెంట్ గా వచ్చిన సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయిన ఈ బ్యూటీ, ఈ వెబ్ సిరీస్ తో మాత్రం హిట్ కొట్టానంటోంది.

జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించాడు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెబుతోంది జీ5. ఈ సిరీస్ లో పుష్ప అనే వేశ్య పాత్ర పోషించింది అంజలి.

"ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే క్రమంలోనే పుష్ప అనే పాత్రను ఎంచుకున్నాను. ఈ కారెక్టర్ నాతో ఏడాదిన్నరకు పైగా ట్రావెల్ చేసింది. ఈ పాత్రను నేను అంత ఈజీగా వదిలి పెట్టలేను. పుష్ప ఆడియెన్స్ అందరికీ నచ్చింది. నటిగా నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. కానీ ఇలాంటి పాత్రలు రాయడం గొప్ప. బహిష్కరణ పెద్ద హిట్టయింది."

ఇలా తను ఓటీటీలో హిట్ కొట్టానంటోంది అంజలి. ఆమె నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. త్వరలోనే గేమ్ చేంజర్ తో ప్రేక్షకులముందుకు రాబోతోంది అంజలి.

First Published:  23 July 2024 5:14 PM GMT
Next Story