Telugu Global
Cinema & Entertainment

Anjali - రత్నమాలగా మారిన అంజలి

Anjali as Ratnamala - విశ్వక్ సేన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది అంజలి. ఆ సినిమా నుంచి అంజలి ఫస్ట్ లుక్ రిలీజైంది.

Anjali - రత్నమాలగా మారిన అంజలి
X

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కెరీర్ లో విశ్వక్ కు ఇది 11వ చిత్రం.

ఇదొక యాక్షన్ డ్రామా. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రచయిత కూడా అతడే.

విలక్షణ నటి అంజలి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనుంది. రత్నమాలగా మాస్ లుక్ లో కనిపిస్తోంది అంజలి.

ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. అంజలి పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. ఓ క్రూరమైన వ్యక్తి, మరింత క్రూరంగా ఎలా మారాడానేది ఈ సినిమా కథ.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ దాస్ కా ధమ్కీ సినిమా తీశాడు విశ్వక్ సేన్. ఆ మూవీ సక్సెస్ తర్వాత విశ్వక్ నుంచి వస్తున్న సినిమా ఇదే. దీని కోసం కొత్తగా మేకోవర్ అయ్యాడు ఈ హీరో. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

First Published:  17 Jun 2023 7:59 AM IST
Next Story