జానీ మాస్టర్ పై ఆనీ మాస్టర్ సంచలన కామెంట్స్ !
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి గాను జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆరోపణల నేపథ్యంలో ఆ అవార్డును రద్దు చేశారు. ఆ అవార్డు రద్దవ్వడంతో, ఆయన కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కోసం జానీ మాస్టర్ కోర్టుకు హాజరవుతున్నారు.
ఈ పరిణామాలపై కొరియోగ్రాఫర్లు తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ మాట్లాడుతూ, "జానీ మాస్టర్ కష్టపడి పైకి వచ్చారు. నమ్మలేనంతగా ఈ పరిస్థితి ఎదురైంది. జానీతో కలసి నేను పలు సార్లు పనిచేశాను. కానీ, నాతో ఎప్పుడూ తప్పుడు ప్రవర్తన చేయలేదు. బాధితురాలికి నిజంగా అన్యాయం జరిగితే, నా మద్దతు ఉంటుంది," అని అన్నారు.
ఇకముందు కొరియోగ్రాఫర్ సందీప్ కూడా జానీ మాస్టర్‌కు మద్దతుగా నిలిచారు. "డ్యాన్స్ మాస్టర్లు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. జానీ మాస్టర్ లాంటి వారు చాలా కష్టపడి జాతీయ అవార్డు దాకా వెళ్లారు. ఈ కేసులో బాధితురాలు జానీతో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి. ఆమెకు ఇబ్బంది ఉంటే ఆయనతో పనిలో ఉండేది కాదు. చట్టం అమ్మాయిల వైపు అనుకూలంగ ఉండటంతో అబ్బాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు," అని సందీప్ అన్నారు.