Anasuya | అనసూయ ఏడుపు వెనక పరమార్థం
Anasuya Sobbing - ఏడుస్తూ ఉన్న వీడియో పోస్టు చేసింది అనసూయ. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వీడియోపై పూర్తి స్పష్టత ఇచ్చింది.
సోషల్ మీడియా పేజీ ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అనసూయ ఏడుపు వీడియో తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ ను భరించలేక, అనసూయ ఇలా గుక్కపెట్టి ఏడ్చిందంటూ కథనాలు కూడా వచ్చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై అనసూయ స్పందించింది. తన ఏడుపుపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు అనసూయ ఏడవలేదంట. వ్యక్తిగతంగా ఓ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ఏడ్చానని వెల్లడించింది. సెలబ్రిటీలు ఎప్పుడూ సరదాగా ఉంటూ, మంచి ఫొటోలు మాత్రమే పోస్టు చేస్తారని అంతా అనుకుంటారని.. వాళ్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయని చెప్పడం కోసమే తను ఏడ్చిన వీడియోను పెట్టానని అంటోంది అనసూయ
అంతే కాకుండా... సదరు నిర్ణయం తీసుకున్నప్పుడు తను ఎలాంటి సంఘర్షణకు గురయ్యానో భవిష్యత్తులో గుర్తు చేసుకోవడం కోసం, ఓ జ్ఞాపకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట.
ప్రస్తుతం తను బాగానే ఉన్నానని, తను పెట్టిన పోస్టును చాలామంది అపార్థం చేసుకున్నారని అంటున్న అనసూయ, తను ఏడ్చే రకం కాదని, ఏడిపించే రకం అంటూ ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చింది.