Telugu Global
Cinema & Entertainment

డిసెంబర్ 21న అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబ‌ర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో అత్యంత భారీగా జ‌ర‌గ‌నుంది.

డిసెంబర్ 21న అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
X

మెగా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 10న ఫ్యాన్స్ ముందుకు వస్తోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ రూపుదిద్దుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో గేమ్ చేంజర్ చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ నెల 21న అమెరికాలోని డాలస్ నగరంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుండడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ నేపథ్యంలో, అభిమానుల కోసం రామ్ చరణ్ ఓ వీడియో సందేశం పంచుకున్నారు. "నమస్తే డాలస్... మీ అందరినీ కలుసుకునేందుకు నేను సూపర్ ఎగ్జయిటింగ్ గా ఉన్నాను. డాలస్ లో మా చిత్రం గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ ను రాజేశ్ కల్లేపల్లి నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్ లో మాతో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఉత్సాహంగా ఉంది... సీ యూ గైస్... లవ్యూ" అంటూ రామ్ చరణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

‘‘భారతీయుడు-2’ చిత్రానికి నెగిటివ్ రివ్యూ లు నేను అసలు ఊహించలేదు. కానీ పర్వాలేదు. ఇప్పుడు రానున్న ‘గేమ్ చేంజర్’ ‘భారతీయుడు-3’ తో బెస్ట్ వర్క్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నాను. ఆడియన్స్ కచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారు. ‘గేమ్ చేంజర్’ సినిమా విషయంలో నేను ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మూవీ అద్భుతంగా వచ్చింది. రామ్ చరణ్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది. ఆయన లుక్, స్టైల్, యాక్షన్, డైలాగ్స్, డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు’ అని తెలుపుతూ.. ‘భారతీయుడు-3 చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తానని ప్రకటించారు శంకర్. రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విన‌య విధేయ‌రామ త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది. ఎస్‌జే సూర్య‌, న‌వీన్ చంద్ర, స‌ముద్ర‌ఖ‌ని, శ్రీకాంత్‌, అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజు క‌థ‌ను అందించాడు. దిల్‌రాజు, శిరీష్ గేమ్ ఛేంజ‌ర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు.

First Published:  19 Dec 2024 9:09 PM IST
Next Story