Ambajipeta Marriage Band | అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీజర్ ఎలా ఉందంటే?
Ambajipeta Marriage Band - అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీజర్ రిలీజైంది. సుహాస్ మరో డిఫరెంట్ పాత్రలో మెప్పించాడు.
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నాడు.
కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్ తదితరులు పాల్గొన్నారు.
టీజర్ చూస్తే, పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథగా కనిపిస్తోంది. హీరో ఓ హెయిర్ సెలూన్ షాపు నడుపుతుంటాడు. అతడికి ఓ బ్యాండ్ మేళం కూడా ఉంటుంది. అదే ఊరిలో ఉన్న హీరోయిన్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే కులాల వల్ల వాళ్ల ప్రేమకు అడ్డంకులు ఏర్పడ్డాయనే విషయాన్ని టీజర్ లో చూపించారు.
హీరో సుహాస్ రొమాంటిక్ గా కనిపిస్తూనే, యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా నటించాడు. టీజర్ చివర్లో గుండు కొట్టించుకొని కనిపించాడు. లక్ష్మీ క్యారెక్టర్ లో హీరోయిన్ శివానీ బాగా చేసింది. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ అంటున్నాడు సుహాస్.
"అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. ధీరజ్ మాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ ఔట్ పుట్ సూపర్బ్ గా ఇచ్చారు. నా డైరెక్టర్స్ నా కెరీర్ ను ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లులా తీర్చిదిద్దారు. మా ఊరిలో గృహప్రవేశం టైమ్ లో కుంకుమ నీళ్లలో అరచేతిని అద్ది కొత్త ఇంటికి గోడకు అచ్చు వేస్తారు. ఆ అచ్చు అలాగే చిరకాలం ఉండిపోతుంది. నా కెరీర్ లో అలాంటి అచ్చు లాంటి సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు".
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి, ఆ వెంటనే ట్రయిలర్ ను విడుదల చేస్తారు. నిజానికి సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. మంచి స్లాట్ కోసం చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన బేబి సినిమా ఎలాగైతే సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్టయిందో, అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ కూడా అలాంటి సక్సెస్ సాధిస్తుందని ఓ అంచనా.