Amala Paul | అమలా పాల్ రెండో పెళ్లి
Amala Paul - హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. ప్రియుడు జగత్ ను పెళ్లాడింది.

హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. కొచ్చిలో ఓ స్టార్ హోటల్ లో ప్రియుడు జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. ఈ పెళ్లికి అమలాపాల్ స్నేహితులు, కొంతమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు.
అమలా పాల్, జగత్ దేశాయ్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రీసెంట్ గా ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్. ఇక అమలాపాల్ పుట్టినరోజున ఇద్దరూ గోవాలో ఉంగరాలు మార్చుకున్నారు. అలా వాళ్ల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ పెళ్లితో ఒకటయ్యారు.
తమకు పెళ్లయిన విషయాన్ని భార్యాభర్తలిద్దరూ సోషల్ మీడియాలో వెల్లడించారు. పెళ్లికి సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు. అమలా పాల్ పెళ్లి దుస్తుల్లో మరింత అందంగా ఉంది.
అమల గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట 2014, జూన్ 12 న చెన్నైలో వివాహం చేసుకున్నారు. అయితే, 2016లో, అమల-విజయ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2017లో వారికి విడాకులు మంజూరయ్యాయి. అప్పట్నుంచి సింగిల్ గా ఉంటున్న అమలాపాల్, ఇప్పుడు జగత్ ను పెళ్లాడింది.