Amala Paul | తల్లి కాబోతున్న హీరోయిన్
Amala Paul - నవంబర్ లో పెళ్లి చేసుకుంది అమలాపాల్. పెళ్లయిన 2 నెలలకే తను గర్భవతినని ప్రకటించింది.

అమలా పాల్, జగత్ దేశాయ్ ఒక శుభవార్త షేర్ చేశారు. తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నట్టు ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇద్దరూ తమ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 5న కేరళలోని కొచ్చిలో అమల, జగత్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట కొత్త ప్రయాణంపై ఆమె అభిమానులు మరియు స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.
“నీతో 1+1 అంటే 3 అని ఇప్పుడు నాకు తెలిసొచ్చింది.” అంటూ అమలాపాల్ ఇనస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. గతేడాది అక్టోబర్ 26న అమలా పాల్, జగత్ దేశాయ్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమె పుట్టినరోజున అతను ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నవంబర్ 4న కొచ్చిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు జనవరిలో తను గర్భవతిననే విషయాన్ని ప్రకటించింది అమలాపాల్.
ప్రధానంగా మలయాళం, తమిళ చిత్రాల్లో వర్క్ చేసింది అమలాపాల్. తెలుగులో రామ్ చరణ్ సరసన 'నాయక్', నానితో 'జెండాపై కపిరాజు' లాంటి సినిమాలు చేసింది. ఈ నటి చివరగా, మమ్ముట్టితో 'క్రిస్టోఫర్' సినిమాలో కనిపించింది. అజయ్ దేవగన్ 'భోలా' (ఖైదీ రీమేక్)లో అతిధి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో లెవెల్ క్రాస్ అనే సినిమా ఉంది.