Urvasivo Rakshasivo movie OTT: అప్పుడే 'ఆహా'లోకి అల్లు శిరీష్ మూవీ | Allu Sirish's Urvasivo Rakshasivo Movie to stream on AHA
Telugu Global
Cinema & Entertainment

Urvasivo Rakshasivo movie OTT: అప్పుడే 'ఆహా'లోకి అల్లు శిరీష్ మూవీ

Urvasivo Rakshasivo movie OTT release date: ఊర్వశివో రాక్షసివో సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అయింది. థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రచారం చేసిన యూనిట్, ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం కూడా మరోసారి ప్రచారం చేయాలని నిర్ణయించింది.

Urvasivo Rakshasivo movie OTT: అప్పుడే ఆహాలోకి అల్లు శిరీష్ మూవీ
X

నెల తిరక్కుండానే ఓటీటీలోకి వస్తోంది ఊర్వశివో రాక్షసివో మూవీ. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమాను ఈనెల 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు.

జీఏ 2 పిక్చర్స్‌, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్ రూపొందించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, సునీల్‌, ఆమ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్. యూత్ ను టార్గెట్ చేస్తూ పూర్తి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

థియేటర్లలో ఊర్వశివో రాక్షసివో సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే అల్లు శిరీష్ హీరో కావడంతో, ఎక్కువమంది ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు రాలేదు. అలా హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లకు నోచుకోలేదు ఈ మూవీ.

ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అవ్వడంతో చాలామంది మూవీని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా ఆహా మరో విజయాన్ని అందుకునేందుకు రెడీగా ఉందన్నమాట.

ఈ చిత్రానికి రైటర్, డైరెక్టర్ రాకేష్ శశి. ప్ర‌తి సంబంధం దేనిక‌దే ప్ర‌త్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ మంచిదా అనే విషయాన్ని ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచ‌న‌తో ఆక‌ట్టుకునేలా ఊర్వ‌శివో రాక్ష‌సివో చిత్రాన్ని తెర‌కెక్కించాడు దర్శకుడు. 'ఆహా'లో డిసెంబ‌ర్ 9న 'ఊర్వ‌శివో రాక్ష‌సివో' ప్రీమియ‌ర్ కానుంది.

First Published:  3 Dec 2022 11:53 AM
Next Story