Telugu Global
Cinema & Entertainment

Buddy | అల్లు శిరీష్ పాటల సందడి

Buddy Movie - అల్లు శిరీష్ తాజా చిత్రం బడ్డీ. ఈ సినిమా పాటల సందడి మొదలైంది.

Buddy | అల్లు శిరీష్ పాటల సందడి
X

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పాటల ప్రచారం మొదలైంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి 'ఫీల్ ఆఫ్ బడ్డీ' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను హిప్ హాప్ తమిళ కంపోజ్ చేసి స్వయంగా పాడడం విశేషం. ఫిమేల్ సింగర్ గా ఐరా ఉడుపి వ్యవహరించారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించారు. 'చూసాలే ఊసాలే నాలో నీ కలనే...దాచాలే దాచాలే నాలో ఆ కలనే..అంటూ హార్ట్ టచింగ్ గా సాగుతూ ఆకట్టుకుంది.

అల్లు శిరీశ్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, అతడి మూవీస్ లో సాంగ్స్ బాగుంటాయి. ఈ విషయంలో శిరీష్ కు మంచి టేస్ట్ ఉందంటారు జనం. ఇప్పుడు బడ్డీ సాంగ్స్ తో కూడా అదే ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నాడు ఈ అల్లు హీరో. ఈ పాజిటివ్ అంశానికి తోడు సినిమా కూడా హిట్టయితే లైమ్ లైట్లోకి రావాలని చూస్తున్నాడు.

First Published:  6 July 2024 5:38 PM GMT
Next Story