Telugu Global
Cinema & Entertainment

సంధ్య థియేటర్‌ ఘటన.. స్పందించిన అల్లు అర్జున్‌ టీమ్‌

మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపిన మూవీ టీమ్‌

సంధ్య థియేటర్‌ ఘటన.. స్పందించిన అల్లు అర్జున్‌ టీమ్‌
X

అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప ది రూల్‌' ప్రీమియర్‌ షోలో భాగంగా సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని తెలిపింది. 'నిన్న రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం' అని తెలిపింది.

పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన హీరో అల్లు అర్జున్‌ చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో వారిని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతితో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పహ తప్పారు. పోలీసులు వారికి సీపీఆర్‌ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది.

సంధ్యా థియేటర్‌ వద్ద తోపులాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై స్పందించిన డాక్టర్లు 48 గంటల్లో పేషెంట్‌ కండిషన్‌ చెప్తామని రాత్రి వెల్లడించారు. మరో 78 గంటలు అయితే గాని పేషెంట్‌ కండిషన్‌ చెప్పలేమని కొద్దిసేపటి కిందట డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీతేజ్‌కు వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

First Published:  5 Dec 2024 1:17 PM IST
Next Story