Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | పుష్ప-2 కొత్త విడుదల తేదీ ఇదే

Allu Arjun's Pushpa 2 - పుష్ప-2 వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ప్రకటించారు.

Pushpa 2 | పుష్ప-2 కొత్త విడుదల తేదీ ఇదే
X

‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటూ బన్నీ డైలాగ్ చెబితే దేశం ఊగిపోయింది. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాను ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడా తేదీ నుంచి సినిమాను వాయిదా వేశారు. డిసెంబర్‌ 6న విడుదల చేయబోతున్నట్టు కొత్త విడుదల తేదీతో పోస్టర్ రిలీజ్ చేశారు.

షూటింగ్‌ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదీని మార్చినట్లు తెలిపారు మేకర్స్‌.

పుష్ప -2 చిత్రం నుంచి ఏ అప్‌డేట్‌ వచ్చినా, ఎలాంటి ప్రమోషన్‌ కంటెంట్‌ విడుదలైన రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది. టీజర్‌తో పాటు ఇటీవల విడుదలైన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

First Published:  17 Jun 2024 4:51 PM GMT
Next Story