జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అల్లు అర్జున్ కుట్ర : ఎమ్మెల్సీ
జానీ మాస్టర్ జైలుకు వెళ్లటంలో అల్లు అర్జున్ కుట్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుట్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో జాతీయ అవార్డు అతనొక్కడికే ఉండాలని బన్నీకుట్ర పన్నారని మల్లన్న అన్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ కి వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లు కాదా..? ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా..? అని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. కాలం కొన్నింటికి సమాధానం చెబుతుంది. అల్లు అర్జున్
నువ్వు కూడా ఒక్క రోజు జైలులో ఉన్నావ్ కదా..? పుష్ప మూవీకి నేషనల్ అవార్డు రావడం ఏంటి..? అంటూ తీవ్ర విమర్శలు చేశారు.నేషనల్ అవార్డు తనకొక్కడికే ఉండాలని కుట్రపూరితంగా ఓ అమ్మాయితో కేసులు పెట్టించి జైలుకు పంపినట్లు ఆరోపించారు. జానీ మాస్టర్‌కు బెయిల్ కూడా రాకుండా సుప్రీం కోర్టు దాకా వెళ్లి కేసులు పెట్టినట్లు చెప్పారు. తాజాగా మల్లన్న మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప సినిమా దెబ్బకు తాను సినిమాలు చూడటం మానేసినట్లు చెప్పారు. ఎర్ర చందనం దొంగతనం చేయటం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. తాజాగా.. మరోసారి అల్లు అర్జున్ అరెస్టుపై కామెంట్స్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.