అల్లు అర్జున్ బెయిల్‌పై విచారణ జనవరి 3కు వాయిదా
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా పడింది.
BY Vamshi Kotas30 Dec 2024 12:41 PM IST
X
Vamshi Kotas Updated On: 30 Dec 2024 12:41 PM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు కూడా దీనిపై కౌంటర్ దాఖలు చేయడంతో ఇరువురు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించగా పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అదేరోజు హైకోర్టులో వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం తెలిసిందే.
Next Story