Telugu Global
Cinema & Entertainment

సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్

పుష్ప-2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్‌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు.

సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
X

పుష్ప-2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్‌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. బన్నీ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రికి ధన్యవాదలు చెప్పే సమయంలో కాస్త తడబడ్డారు. వెంటనే సవరించుకొని ధరలు పెంచుకునే అవకాశమిచ్చిన రేవంత్ రెడ్డికి ధాంక్స్ చెప్పారు. నెటిజన్లు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి పేరును అల్లు అర్జున్‌ మరిచిపోయారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రక్క ఉన్న వారు గుర్తుచేస్తే సీఎం పేరు చెప్పారని పొస్టులు చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లానని బన్నీ అన్నారు.

థియేటర్ బయట అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సినిమా చూడకుండానే వెళ్లిపోయాను. అక్కడ రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి నాకు సమయం పట్టింది. ఇలా జరిగినందుకు నిజంగా సారీ. ఆ కుటుంబానికి అండగా ఉంటాము అని హామీ ఇచ్చాడు. మాకు ఎంతో సపోర్ట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డికి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కళ్యాణ్ బాబాయ్‌కు థాంక్స్ . అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.నేడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్, రవిశంకర్, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు హాజరయ్యారు.

First Published:  7 Dec 2024 8:54 PM IST
Next Story