హైకోర్టుకు అల్లు అర్జున్..అందుకోసమేనా?
తనపై నమోదైన కేసును కొట్టేయాలని తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బన్నీపై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్‌ను అల్లు అర్జున్ దాఖలు చేశారు.
బన్నీ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి(39) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు