Telugu Global
Cinema & Entertainment

పాలిటిక్స్‌లోకి బన్నీనా? అదంతా తూచ్‌!

తమ అధికారిక ప్రకటన మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న హీరో టీమ్‌

పాలిటిక్స్‌లోకి బన్నీనా? అదంతా తూచ్‌!
X

పుష్ప మూవీతో గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగిన అల్లు అసర్జున్‌ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశకమైంది. సోషల్‌ మీడియాను ఈ వార్త షేక్‌ చేస్తుండటంతో బన్నీ టీమ్‌ రియాక్ట్‌ అయ్యింది. అల్లు అర్జున్‌ రాజకీయాల్లోకి వస్తున్నారనేది తప్పుడు ప్రచారమని వివరణ ఇచ్చింది. ఇలాంటి నిరాధారమైన వార్తను ఎవరూ ప్రసారం చేయొద్దు, నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. అల్లు అర్జున్‌ కు సంబంధించిన ఏ విషయమైనా ఆయన టీమ్‌ అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని, దానిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరింది. తాము ధ్రువీకరించని ఏ సమాచారాన్ని కూడా స్ప్రెడ్‌ చేయొద్దని విజ్ఞప్తి చేసింది.

First Published:  12 Dec 2024 11:16 PM IST
Next Story