Telugu Global
Cinema & Entertainment

రాఘవేంద్రరావును ట్రోల్ చేసిన అల్లు అరవింద్

Allu Aravind: అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత, రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడిని ఆటపట్టిస్తే ఎలా ఉంటుంది?

రాఘవేంద్రరావును ట్రోల్ చేసిన అల్లు అరవింద్
X

బీఏ అనేది ఓ విద్యార్హత. కానీ రాఘవేంద్రరావు బీఏ అంటే ఏంటో తెలుసా? దీనికి సరికొత్త అర్థం చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. రాఘవేంద్ర రావు బీఏ అంటే, రాఘవేంద్రరావు బొడ్డు మీద ఏపిల్ అని అర్థం అంట.


బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి సురేష్ బాబు, అల్లు అరవింద్ తో పాటు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావును ఇలా బొడ్డు మీద ఆపిల్ అంటూ ఆటపట్టించారు అల్లు అరవింద్. రేపు ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.


అల్లు అరవింద్ ఎంత ఆటపట్టించారో, రాఘవేంద్రరావు దాన్ని అంతే తేలిగ్గా తీసుకున్నారు. ఆపిల్ కింద పడితే ఐన్ స్టీన్ శాస్త్రవేత్త అయ్యాడని, అయితే ఆ ఆపిల్ ఎక్కడ పడితే బాగుంటుందో తను కనిబెట్టానని రాఘవేంద్రరావు స్టేట్ మెంట్ ఇచ్చారు.


రాఘవేంద్రరావు సినిమాల్లో ఆపిల్ కామన్. అది భక్తిరస చిత్రమైనా, అందులో హీరోయిన్ బొడ్డుపై ఆపిల్ వేయడానికి వెనకాడరు రాఘవేంద్రరావు. అందుకే ఈ దర్శకుడిపై అల్లు అరవింద్ ఇలా సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  1 Dec 2022 1:17 PM
Next Story