Telugu Global
Cinema & Entertainment

Ugram Movie - ఉగ్రం మూవీ టీజర్ లాంచ్

Ugram Movie - అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఉగ్రం. ఈ సినిమా టీజర్ ను నాగచైతన్య రిలీజ్ చేశాడు. టీజర్ ఎలా ఉందంటే..!

Ugram Movie - ఉగ్రం మూవీ టీజర్ లాంచ్
X

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్‌లో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్, తాజాగా టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ ప్రారంభించారు. హీరో నాగ చైతన్య టీజర్ ని లాంచ్ చేశాడు.

నరేష్ పవర్ ఫుల్ పోలీసుగా ఎంట్రీ ఇవ్వడం , అడవిలో చట్టాన్ని ఉల్లంఘించేవారిని కొట్టడం.. వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో టీజర్ ప్రారంభమైంది. ‘’ఒంటి మీద యూనిఫాం ఉందనేగా ఈ పొగరు. ఈ రోజు నీదే.. నాకూ ఓ రోజు వస్తుంది’’ అని విలన్ చెప్పగా.. ‘నాది కాని రోజు కూడా.. నేను ఇలాగే నిలబడతా.. అర్ధమైందా ‘’ అని నరేష్ బదులివ్వడం నరేష్ పాత్ర తీరును తెలియజేస్తుంది.

విలన్స్ తన కుటుంబం జోలికి వచ్చినపుడు పోలీసుగా ఉన్న నరేష్ ఎలాంటి ఉగ్రరూపం చూపిస్తాడనేది క్యురియాసిటీ పెంచేలా చూపించారు. అల్లరి నరేష్ పాత్రను విజయ్ కనకమేడల కొత్తగా, ఇంటెన్స్ గా డిజైన్ చేశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నరేష్ సరిగ్గా సరిపోవడమే కాకుండా ప్రేక్షకులని ఎంగేజ్ చేసేలా ఆకట్టుకున్నాడు. నరేష్ భార్య పాత్రలో మిర్నా కనిపించింది.

తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. సిద్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ బాగున్నాయి.



First Published:  23 Feb 2023 9:06 AM IST
Next Story