Telugu Global
Cinema & Entertainment

Ugram Movie - అల్లరినరేష్ సినిమాకు కొత్త విడుదల తేదీ

Ugram Movie - అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Ugram Movie - అల్లరినరేష్ సినిమాకు కొత్త విడుదల తేదీ
X

అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉగ్రం. గతంలో ఇద్దరూ కలిసి నాంది అనే సినిమా తీశారు. అది మంచి విజయాన్నందుకుంది. దీంతో ఉగ్రంపై అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. పోలీస్ అధికారిగా నరేష్ సీరియస్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ సింగిల్ దేవేరికి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఉగ్రం, మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

నిజానికి ఈ సినిమాను ఈ నెల్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ బాక్సాఫీస్ బరిలో రద్దీ ఎక్కువగా ఉంది. పైగా ప్రచారం చేయడానికి తగినంత సమయం లేదు. అందుకే సినిమాను మే 5కు వాయిదా వేశారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశాడు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  4 April 2023 12:43 PM IST
Next Story