Telugu Global
Cinema & Entertainment

ఉగ్రం షూటింగ్ మొదలు.. ఇంట్రెస్టింగ్ గ్లింప్స్

అల్లరి నరేష్ కొత్త సినిమా ఉగ్రం. ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఉగ్రం షూటింగ్ మొదలు.. ఇంట్రెస్టింగ్ గ్లింప్స్
X

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వసున్న రెండో చిత్రం ఉగ్రం. నాంది తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈసారి మరింత విభిన్నమైన కథను ఎంచుకున్నాడట కనకమేడల.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ముఖానికి నల్లటి మాస్క్ లా రంగు, అల్లరి నరేష్‌ క్లోజ్‌అప్‌ లో కళ్ళని అటు ఇటు తిప్పి దేని కోసమో వెతకడం, ఒక చోట చూపు నిలపడం, కళ్ళు ఎర్రగా మారడం.. ఇలా చాలా టెర్రిఫిక్ గా ఉంది వీడియో. వీడియో లో వినిపించిన నేపధ్యం సంగీతం కూడా ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది. టైటిల్ కి తగ్గట్టుగా ఈ గ్లింప్స్ వీడియో అల్లరి నరేష్ పాత్ర ఉగ్రరూపాన్ని తెలియజేస్తుంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. నాంది చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీం దాదాపుగా ఉగ్రంలో కూడా భాగమైంది. అబ్బూరి రవి మాటలు రాస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.


First Published:  6 Sept 2022 10:09 AM IST
Next Story