Telugu Global
Cinema & Entertainment

అల్లరి నరేష్ కొత్త సినిమా మొదలైంది

అల్లరి నరేష్ కొత్త సినిమా మొదలుపెట్టాడు. తనకు గతంలో నాంది లాంటి హిట్టిచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. దీనికి ఉగ్రం అనే టైటిల్ పెట్టారు.

అల్లరి నరేష్ కొత్త సినిమా మొదలైంది
X

మొన్ననే ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం అనే సినిమాను పూర్తి చేశాడు అల్లరినరేష్. అంతలోనే మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన 'నాంది' చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రాన్ని తన సరికొత్త ఇన్నింగ్స్ నాందిగా భావించారు. వీరిద్దరూ కలిసి తమ రెండో సినిమా కోసం చేతులు కలిపారు. ఇటివలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత దిల్ రాజు క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించాడు.

టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే ఈ చిత్రానికి 'ఉగ్రం' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆవేశంతో అరుస్తుండగా, అతని వెనుక భాగంలో కత్తిపోటు, శరీరమంతా గాయాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ 'ఉగ్రం' టైటిల్‌ కు సరైన జస్టిఫికేషన్ ఇచ్చింది. టైటిల్ ని రెడ్ కలర్‌తో డిజైన్ చేయడం ఆసక్తికరంగా ఉంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ మరో మంచి రోజు ఆ విషయాన్ని బయటపెడతారంట. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇందులో నరేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు దర్శకుడు కనకమేడల. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు.





First Published:  22 Aug 2022 6:17 PM IST
Next Story