Telugu Global
Cinema & Entertainment

Itlu Maredumilli Prajaneekam: మరో ఇంటెన్స్ రోల్ లో అల్లరి నరేష్

విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నాడు అల్లరినరేష్. ఇందులో భాగంగా అతడు చేసిన సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ అయింది.

Itlu Maredumilli Prajaneekam: మరో ఇంటెన్స్ రోల్ లో అల్లరి నరేష్
X

అల్లరి నరేష్‌కి నాంది సినిమా చేసినప్పటి నుండి కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ రిలీజైంది.

టైటిల్ కు తగ్గట్టు, సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు టీమ్ అంతా మారేడుమిల్లికి వెళ్లారు. నరేష్ ఎన్నికల అధికారిగా మారేడుమిల్లిలోకి ప్రవేశించడంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. హాస్పిటల్ లాంటి కనీస సేవలు కూడా అందని స్థానికులు పడుతున్న ఇబ్బందులను చూసి హీరో చలించిపోతాడు. వారి కోసం పోరాడాలని నిర్ణయించుకుంటాడు.

అయితే అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్లడం అంత సులభం కాదు. ఆదివాసీలంతా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచినా, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి తెలుసు. ఈ విషయాల్ని కూడా ట్రయిలర్ లో చూపించారు.

కథాంశం ఆలోచింపజేసేలా ఉంది. దర్శకుడు ఏఆర్ మోహన్ టేకింగ్ ట్రయిలర్ లో కట్టిపడేసేలా ఉంది. మరీ ముఖ్యంగా ఎద్దులతో ఫైట్, నదీ ప్రవాహంలో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు ఆసక్తిని పెంచాయి. టెక్నికల్ గా చూసుకుంటే.. కెమెరామెన్ రాంరెడ్డి, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, అబ్బూరి రవి డైలాగ్స్‌ బాగున్నాయి.

అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యతగల ప్రభుత్వ అధికారిగా అల్లరి నరేష్ మరో బలమైన పాత్రలో కనిపించాడు. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుంది.



First Published:  13 Nov 2022 9:59 AM IST
Next Story