Telugu Global
Cinema & Entertainment

Aa Okkati Adakku | ఆ ఒక్కటి అడక్కు టీజర్ ఎలా ఉందంటే?

Aa Okkati Adakku - క్లాసిక్ టైటిల్ తో వస్తున్నాడు అల్లరోడు. ఆ ఒక్కటి అడక్కు టీజర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం.

Aa Okkati Adakku | ఆ ఒక్కటి అడక్కు టీజర్ ఎలా ఉందంటే?
X

హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే హిట్టవ్వగా, తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో ఫన్నీ గా ప్రారంభమైంది టీజర్. హీరో ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లే అతనికి సరిపోయే అమ్మాయి దొరకదు.

అలాంటి సమయంలో అతను, ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్ గా చెప్పేస్తుంది.

లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది, పాన్ ఇండియా లాంటి సమస్య పెళ్లిని ఎంచుకున్న మల్లి అంకం దీనిని వినోదాత్మకంగా రూపొందించాడు. అల్లరి నరేష్ తన అల్లరితో మళ్ళీ అలరించాడు. నరేష్ గర్ల్ ఫ్రెండ్ గా ఫరియా అబ్దుల్లా కూల్ గా కనిపించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష మొదలైన హాస్యనటులు మరింత వినోదాన్ని పంచారు.

తన తండ్రి ఈవీవీ తీసిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదంటున్నాడు అల్లరి నరేష్. పాత సినిమాలో జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునేవాడి కథను చూపిస్తే.. తాజా చిత్రంలో సెటిల్ అయినా కూడా పెళ్లి కాని వాడి కథను చూపించారు.

First Published:  12 March 2024 11:07 PM IST
Next Story