Allari Naresh: 'మారేడుమిల్లి"లో చివరి 20 నిమిషాలు హైలెట్
Itlu Maredumilli Prajaneekam: అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు హైలెట్ అంటున్నాడు అల్లరోడు.

అల్లరి నరేష్ నుంచి రేపు కొత్త సినిమా రాబోతోంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనేది ఈ సినిమా టైటిల్. ఏఆర్ మోహన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా సీరియస్ సబ్జెక్ట్ తో తెరకెక్కింది. చివరి 20 నిమిషాలు ఈ సినిమాకు ప్రాణం అంటున్నాడు అల్లరినరేష్. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన అల్లరి నరేష్.. మారేడుమిల్లి హైలెట్స్ వివరించాడు.
"'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం జనం సినిమా. జనం అంటే మనం. మన చుట్టుపక్కల జరిగే కథ ఇది. ప్రేక్షకులు కొత్త కంటెంట్ ని కోరుకుంటున్నారు. అందుకే కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో వస్తున్నాను. ఓ మంచి మెసేజ్ ఇందులో ఉంది. చివరి 20 నిమిషాలు మా సినిమాకు ప్రాణం."
ఇలా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు అల్లరినరేష్. జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాలో.. ఆనంది హీరోయిన్ గా నటించింది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు.