అన్న విష్ణు వల్లే ఇదంతా జరుగుతుంది : మనోజ్
రాచకొండ సీపీ కార్యాలయంలో హీరో మంచు మనోజ్ విచారణ పూర్తి అయింది. సుమారు గంటన్నరపాటు మనోజ్‌ను ప్రశ్నించి పోలీసులు వివరణ తీసుకున్నారు.
రాచకొండ సీపీ కార్యాలయంలో హీరో మంచు మనోజ్ విచారణ పూర్తి అయింది. సుమారు గంటన్నరపాటు మనోజ్‌ను ప్రశ్నించి పోలీసులు వివరణ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ నాకు న్యాయం జరుగుతుందని పోలీసు వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందన్నారు. మా అన్న విష్ణు ప్రోత్బలంతో ఇదంతా జరుగుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రగిరి నేను పెద ప్రజల కోసం పోరాడుతున్నమన్నారు.
వినయ్ అనే వ్యక్తి విద్య నికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడని నేను మా నాన్నగాకి చెబుతున్న పట్టించుకోవడం లేదు. నాన్నకి ఇవన్నీ విషయాలు తెలియదు. నేను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్ కిరణ్ అనే వ్యక్తులని పోలీసులు పట్టుకొని దర్యాప్తు చేస్తున్నారు అని మనోజ్ వివరించారు. మరోవైపు మంచు కుటుంబంలో జరుగుతున్న గొడలపై మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలవుతుంది. ఫీస్ అంటూ ఆమె కూతురి వీడియోను షేర్ చేసింది. దీనికి మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా లైక్ చేయడం మరింత చర్చకు దారితీసింది.