Telugu Global
Cinema & Entertainment

Sarfira Movie | చప్పగా మారిన సర్ఫిరా

Sarfira Movie - 'ఆకాశం నీ హద్దురా' సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది సర్ఫిరా. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.

Sarfira Movie | చప్పగా మారిన సర్ఫిరా
X

సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా గుర్తుందా? సుధా కొంగర డైరక్ట్ చేసిన ఈ సినిమా సౌత్ లో సూపర్ హిట్టయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా సూర్యకు జాతీయ అవార్డ్ సైతం తెచ్చిపెట్టింది.

అయితే ఈ సినిమా హిందీ రీమేక్ మాత్రం బొక్కబోర్తా పడింది. ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో రీమేక్ చేశాడు అక్షయ్ కుమార్. సినిమాకు సర్ఫిరా అనే టైటిల్ పెట్టాడు. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.

అక్షయ్ కుమార్ కు రీమేక్స్ కొత్త కాదు. గతంలో చాలా రీమేక్స్ తో అతడు సూపర్ హిట్స్ అందుకున్నాడు. అంతెందుకు, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన విక్రమార్కుడు సినిమాను హిందీలో రీమేక్ చేసింది కూడా ఇతడే. ఆ సినిమాతో ఇతడు తిరుగులేని స్టార్ అనిపించుకున్నాడు.

అలా రీమేక్ కింగ్ గా పేరుతెచ్చుకున్న అక్షయ్ కుమార్, తాజా రీమేక్ తో మాత్రం డిజాస్టర్ అందుకున్నాడు. ఆశ్చర్యంగా సర్ఫిరా సినిమాకు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమాకొచ్చే ప్రేక్షకులకు చాయ్-సమోసా కూడా ఉచితంగా అందించారు. ఈ ఆఫర్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

First Published:  17 July 2024 6:17 AM GMT
Next Story