Telugu Global
Cinema & Entertainment

Agent Movie: అఖిల్ అదరగొట్టాడు

Agent Movie: అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ మూవీ నుంచి మరో వీడియో రిలీజైంది. ఈసారి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

Agent Movie: ఫైనల్ షెడ్యూల్ కు అంతా రెడీ
X

Agent Movie: ఫైనల్ షెడ్యూల్ కు అంతా రెడీ

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చాన్నాళ్ల కిందటే టీజర్ రిలీజ్ చేశారు. ఎందుకంటే, ఆ టైమ్ లో సినిమాను సంక్రాంతికి రెడీ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. ఏజెంట్ సినిమా సంక్రాంతికి రావడం లేదు.

దీంతో ఇప్పుడీ సినిమాను సమ్మర్ కు వాయిదా వేశారు. ఈ మేరకు ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏజెంట్ సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన మేకింగ్ షాట్స్ తో ఈ వీడియోను కట్ చేశారు. ఇందులో యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు అఖిల్. దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఒక్కో సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడు.

అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది ఏజెంట్. ఇందులో అతడు గూఢచారిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం జుట్టు పెంచడంతో పాటు, కండలు పెంచి ఎయిట్-ప్యాక్ కూడా సాధించాడు. సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది.

హిపాప్ తమీజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.



First Published:  1 Jan 2023 6:22 PM IST
Next Story