Telugu Global
Cinema & Entertainment

Good Bag Ugly | అజిత్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Ajith's Good Bag Ugly - మరోసారి సంక్రాంతికి మెరవబోతున్నాడు అజిత్. అతడి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Good Bag Ugly | అజిత్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
X

స్టార్ హీరో అజిత్ కుమార్‌తో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టు అజిత్ ని మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ బాగుంది. ఫస్ట్ లుక్ లో రంగురంగుల చొక్కా ధరించిన అజిత్, చేతినిండా టాటూస్ తో కనిపించాడు.

మూడు లుక్స్ లో మూడు డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచిన ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

మూడేళ్ల కిందట అజిత్ నటించిన సినిమా ఒకటి సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. ఆ టైమ్ లో విడుదల రోజున తమిళనాట అజిత్ అభిమాని ఒకరు మృతి చెందారు. అప్పట్నుంచి తన సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం ఆపేశాడు అజిత్. మళ్లీ ఇన్నేళ్లకు, అజిత్ సినిమా సంక్రాంతికి సిద్ధమౌతోంది.

First Published:  22 May 2024 1:47 AM GMT
Next Story