Ajith | అజిత్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
Ajith Trisha Movie - చాన్నాళ్ల తర్వాత అజిత్-త్రిష మరోసారి కలిశారు. వీళ్ల సినిమా షూటింగ్ అప్ డేట్
కోలీవుడ్ స్టార్ అజిత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలోని అజిత్ లుక్ బయటకు రావడంతో ఒక్కసారిగా అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి.
‘విడాముయర్చి’ సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ మూవీపై అందరి దృష్టి పడింది. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ చిత్రంలో భాగమయ్యారు.
అజిత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు తాజా చిత్రంతో ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు. ఈ చిత్రంలో రెజీనా కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు చిత్రయూనిట్ అందరూ కలిసి ఫోటోకు పోజిచ్చారు. మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్పటికే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేశాడు. త్వరలోనే ఆ సాంగ్స్ ను విడుదల చేస్తారు.
అజిత్ కుమార్ ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.