Mangalavaaram | మంగళవారం.. ఎవ్వరూ టచ్ చేయని పాయింట్
Mangalavaaram movie - ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ తో మంగళవారం సినిమా చేస్తున్నాడట దర్శకుడు అజయ్ భూపతి. ఈ ప్రాజెక్టుపై భూపతి చాలా నమ్మకంగా ఉన్నాడు.
తెలుగుతెరపై ఎన్నో కథలు వచ్చాయి, ఎన్నో జానర్స్ టచ్ చేస్తూ సినిమాలు తీశారు మేకర్స్. అయితే ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని కథ ఎంచుకున్నాడట దర్శకుడు అజయ్ భూపతి. ఓ డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకొని మంగళవారం అనే సినిమాను తెరకెక్కించాడు.
"డార్క్ థ్రిల్లర్ ఇది. డిఫరెంట్ జానర్ సినిమా తీశా. అంతకు మించి ఏమీ చెప్పలేను. అందులోనూ ఈ తరహా విలేజ్ & నేటివిటీతో కూడిన డార్క్ థ్రిల్లర్ తీయడం ఇంకా కష్టం. షూటింగ్ చేసేటప్పుడు ఎడిటింగ్, సౌండ్ మనసులో ఉండాలి. ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని షూటింగ్ చేయాలి. ఎవరూ టచ్ చేయని పాయింట్ టచ్ చేశా. 'ఆర్ఎక్స్ 100'ని ఆదరించినట్టు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. 'మంగళవారం' టైటిల్ వెనుక కారణం ఉంది. అది సినిమా చూస్తే తెలుస్తుంది. దేవతలకు ఇష్టమైన రోజు మంగళవారం. దానిని జయవారం అని కూడా అంటారు. ఎవరో కొందరు పిచ్చ పిచ్చ సామెతలు చెబుతారు. వాటిని పట్టించుకోవద్దు."
ఇలా తన సినిమా గురించి వివరంగా మాట్లాడాడు అజయ్ భూపతి. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు. ట్రయిలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఓవరాల్ గా స్టన్నింగ్ గా ఉంది మంగళవారం సినిమా. ఈ ట్రయిలర్ లాంచ్ లోనే మాట్లాడుతూ, పైవిధంగా స్పందించాడు అజయ్ భూపతి.
అజ్మల్, పాయల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమాలో పాయల్ చాలా సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది. అంతేకాదు, ఆమె మేకప్ కూడా వేసుకోలేదు. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమా తనకు రావడం తన అదృష్టం అంటున్న పాయల్... మంగళవారం మూవీని తన రీఎంట్రీ ప్రాజెక్టుగా చెబుతోంది.