Telugu Global
Cinema & Entertainment

Aishwarya Arjun | మరో 2 రోజుల్లో హీరోయిన్ పెళ్లి

Aishwarya Arjun - అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఈమె పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.

Aishwarya Arjun | మరో 2 రోజుల్లో హీరోయిన్ పెళ్లి
X

సీనియర్ హీరో అర్జున్ కూతురు, ఐశ్వర్య అర్జున్ పెళ్లికి కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం చెన్నైలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్య అర్జున్ వివాహం జరగబోతోంది. ఈ ఆలయాన్ని అర్జున్ కట్టించాడు.

ఐశ్వర్య అర్జున్, ఉమాపతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. గతేడాది అక్టోబర్ లో వీళ్ల నిశ్చితార్థం జరిగింది. సోమవారం పెళ్లితో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది.

వివాహానికి సంబంధించి వేడుకలు ఆల్రెడీ మొదలయ్యాయి. అర్జున్ ఇంట్లో జరిగిన హల్దీ ఫంక్షన్ తో ఈ పెళ్లి వేడుక ఆరంభమైంది. ఈరోజు మెహందీ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. రేపు సంగీత్ ను సెలబ్రేట్ చేయబోతున్నారు.

పెళ్లికి ముందు తన స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చింది ఐశ్వర్య అర్జున్. అందర్నీ బాలి ద్వీపానికి తీసుకెళ్లింది. అంతా అక్కడ 3 రోజుల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఆ వెంటనే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.

తన కూతుర్ని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అర్జున్. విశాల్ హీరోగా నటించిన సినిమాతో ఆమె హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత మరో 2 సినిమాలు చేసింది. అయితే ఇవేవీ ఆమెకు కలిసిరాలేదు. ఇక తెలుగులో కూడా కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు అర్జున్ అన్ని ఏర్పాట్లు చేశాడు. స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా మారి కూతుర్ని హీరోయిన్ గా, విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి సినిమా సినిమా ప్లాన్ చేశాడు. కానీ ఆఖరి నిమిషంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

First Published:  8 Jun 2024 11:06 PM IST
Next Story