Telugu Global
Cinema & Entertainment

Aditi Rao Siddharth | పెళ్లి కాదు నిశ్చితార్థం

Aditi Rao and Siddharth - అదితి రావు, సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఈ మేటర్ లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే..?

Aditi Rao Siddharth | పెళ్లి కాదు నిశ్చితార్థం
X

హీరో సిద్ధార్థ్, అతిథి రావు హైదరి పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్లో వీరి వివాహం జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. వివిధ మీడియా సంస్థలు కూడా విభిన్న కథనాలు అందించాయి. ఈ మొత్తం గందరగోళానికి కారణం, ఆలయంలో అర్చకులకు షూటింగ్ అని చెప్పడమే.

అవును.. తామిద్దరం పెళ్లి చేసుకోబోతూ.. అది సినిమా షూటింగ్ అని పూజారులకు చెప్పారంట. షూటింగ్ అని చెప్పడంతో పూజారులు లైట్ తీసుకున్నారట. అలా సెట్ కూడా వేశారు. అతిథులు కూడా కొంతమంది వచ్చారు. పూజారుల గెటప్పుల్లో కొంతమంది తమిళవాళ్లు కూడా వచ్చారు. కానీ మేటర్ ఏంటంటే, వాళ్లు నిజమైన పూజారులే.

వాళ్లను ప్రత్యేకంగా తమిళనాడు నుంచి సిద్దార్థ్ రప్పించాడు. సిద్దార్థ్ సెంటిమెంట్ ప్రకారం తమిళ అర్చకుల నేతృత్వంలో, అదితి సెంటిమెంట్ ప్రకారం రంగనాధ స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఇది పెళ్లి కాదు. కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగినట్టు హీరోహీరోయిన్లు ప్రకటించారు. తమ చేతికి తొడిగిన ఉంగరాలు చూపిస్తూ వాళ్లు ఫొటో కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే అదితిరావు, సిద్దార్థ్ తమ పెళ్లి తేదీని ప్రకటిస్తారు.

First Published:  29 March 2024 7:56 AM IST
Next Story