Adipurush Movie: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఆదిపురుష్?
Adipurush Movie: సంక్రాంతి రేసులో నుంచి ఆదిపురుష్ తప్పుకుందా? ప్రభాస్ సినిమా పండక్కి రావడం లేదా?

Adipurush New Poster: ఆదిపురుష్ కొత్త పోస్టర్
Adipurush Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసి మేకర్స్ ప్రమోషన్ మొదలుపెట్టారు. అయోధ్యలో భారీ ఎత్తున జరిగిన ఈవెంట్ లో టీజర్ లాంచ్ చేశారు. అలాగే హైదరాబాద్ లో కూడా ఈవెంట్ ఏర్పాటు చేసి 3డీ టీజర్ రిలీజ్ చేశారు.
అయితే మేకర్స్ చెప్పినట్టు ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదని తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేయడంతో పాటు, ఆల్రెడీ చేసిన గ్రాఫిక్స్ వివాదాస్పదమవ్వడంతో, వాటిని కూడా మార్చాల్సి ఉంది. ఈ కారణంతో సినిమా సంక్రాంతి బరి నుంచి స్కిప్ అయినట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్ కనిపించనుంది. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు.