Adipurush - ఆదిపురుష్ వారం రోజుల వసూళ్లు
Adipurush Movie First Week Collections - మొదటి వారం ముగిసింది. ఆదిపురుష్ సినిమాకు నష్టాలు తప్పవని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లు చూద్దాం..
ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్. ప్రవంచవ్యాప్త వసూళ్లలో ఇప్పటికే 400 కోట్ల రూపాయల గ్రాస్ దాటేసిన ఈ సినిమా, నిన్నటి వసూళ్లతో ఈ నంబర్ ను మరింత పెంచుకుంది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ సినిమాకు, వరల్డ్ వైడ్ 445 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో ఈ సినిమాకు 78 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. జీఎస్టీ మినహాయించి చూసుకుంటే, ఏపీ,నైజాంలో ఈ సినిమా 58శాతం రికవర్ అయింది. ఇక ఈ సినిమాకు మిగిలిన ఆప్షన్ ఈ శని, ఆదివారాలు మాత్రమే. ఈ రెండు రోజుల్లో వచ్చే వసూళ్లే ఈ సినిమాకు ఫైనల్ అని చెబుతోంది ట్రేడ్.
ఆదిపురుష్ 7 రోజుల కలెక్షన్స్ (GST తో కలిపి)
నైజాం : 35.51 కోట్లు
సీడెడ్ : 10.74 కోట్లు
ఉత్తరాంధ్ర : 9.47 కోట్లు
ఈస్ట్ : 5.55 కోట్లు
వెస్ట్ : 4.53 కోట్లు
గుంటూరు: 6.40 కోట్లు
కృష్ణా : 4.27 కోట్లు
నెల్లూరు : 2.23 కోట్లు
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ షేర్ మొత్తం : 78.70 కోట్లు