Adipurush trailer review: ఆదిపురుష్ ఫైనల్ ట్రయిలర్ ఎలా ఉందంటే?
Adipurush final trailer review: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. తాజాగా ఈ సినిమా ఫైనల్ ట్రయిలర్ ను విడుదల చేశారు. ఎలా ఉందో చూద్దాం..

Adipurush trailer review: ఆదిపురుష్ ఫైనల్ ట్రయిలర్ ఎలా ఉందంటే?
ఆదిపురుష్ కు సంబంధించి సెకెండ్ ట్రయిలర్ రిలీజైంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో, ఫైనల్ ట్రయిలర్ పేరిట దీన్ని విడుదల చేశారు. అంటే, మరో ట్రయిలర్ ఉండదన్నమాట. ఇక ఫైనల్ ట్రయిలర్ విషయానికొస్తే.. తాజా ట్రయిలర్ లో యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
సీత గీత దాటడం, రావణుడు సీతను అపహరించడం లాంటి ఎపిసోడ్స్ తో పాటు.. రావణుడిపై రాముడు యుద్ధం ప్రకటించడం, వానర సైన్యాన్ని సమాయత్తం చేయడం, అంతిమంగా బ్రహ్మాస్త్రం ప్రయోగించడం లాంటి కీలకమైన ఎన్నో సన్నివేశాల్ని, ఫైనల్ ట్రయిలర్ లో చూపించారు.
ఆదిపురుష్ లో గ్రాఫిక్స్ బాగున్నాయనే విషయం ఫైనల్ ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది. గ్రాఫిక్స్, యుద్ధ సన్నివేశాలతో పాటు.. ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ట్రయిలర్ లో హైలెట్ గా నిలిచాయి. 16వ తేదీన వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది ఆదిపురుష్ సినిమా.
ఓం రౌత్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల హక్కుల్ని పీపుల్ మీడియా దక్కించుకుంది. ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయ్యాయి.