పొలిటికల్ ఎంట్రీపై నటి వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయ లలితనే తనకు స్ఫూర్తి అని.. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా కొంత సమయం ఉందని చెప్పారు. ఆమె తండ్రి శరత్ కుమార్ కూడా AISMK స్థాపించి తరువాత భారతీయ జనతా పార్టీలో విలీనం చేసారు. తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మి శరత్ కుమార్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయలో హట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ప్రముఖ నటి త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.
రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న హీరోయిన్ త్రిష కీలక వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టారు. ఈమె వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా పని చేసిన విషయం తెలిసిందే.