Telugu Global
Cinema & Entertainment

పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో నటి సాయి పల్లవి

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా న‌టి సాయిప‌ల్ల‌వి పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబాను ద‌ర్శించుకున్నారు.

పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో నటి సాయి పల్లవి
X

న్యూ ఇయర్ సందర్బంగా ప్రముఖ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబాను ద‌ర్శించుకున్నారు. కుటుంబంతో క‌లిసి పుట్ట‌ప‌ర్తికి వెళ్లిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టుచీరలో సంప్రదాయంగా క‌నిపించారామె. బాబా నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకున్నారు.కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక త‌మిళ న‌టుడు శివ కార్తికేయ‌న్ హీరోగా, సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన 'అమ‌ర‌న్' చిత్రం ఇటీవ‌ల బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అలాగే ప్ర‌స్తుతం ఆమె టాలీవుడ్‌లో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న‌ 'తండేల్' సినిమాలో న‌టిస్తున్నారు.

కొత్త సంవత్సర సందర్భాన్ని దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మికతతో జరుపుకున్నారు.సత్యసాయి సన్నిధిలో పాటలకు సాయి పల్లవి లీనమయ్యారు. కళ్లు మూసుకొని ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి. సాయి పల్లవిని చాలా మంది ప్రశంసిస్తున్నారు.ఇతర సినీ సెలెబ్రిటీలతో పోలిస్తే భిన్నంగా ఆధ్యాత్మికతతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్న సాయి పల్లవిని పొగుడుతున్నారు నెటిజన్లు. సాయి పల్లవి అంటే ఇదీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  1 Jan 2025 4:06 PM IST
Next Story