Telugu Global
Cinema & Entertainment

Sadaa | విడాకులు తీసుకుంటే తప్పేంటి?

Actress Sada - జీవితాంతం ఇబ్బంది పడుతూ కాపురం చేసే కంటే విడాకులు తీసుకోవడం మంచిదంటోంది హీరోయిన్ సదా. ఈమెకింకా పెళ్లి కాలేదు.

Sadaa | విడాకులు తీసుకుంటే తప్పేంటి?
X

పెళ్లి కూడా కాకుండానే విడాకుల గురించి మాట్లాడుతోంది హీరోయిన్ సదా. "వెళ్లు బాబూ వెళ్లు.." అంటూ ఒకప్పుడు కుర్రాళ్లను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ, ప్రేమ-పెళ్లిపై స్పందించింది.

"నేను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను. ఈ ఫ్రీడమ్ ను వదులుకోవడం ఇష్టం లేదు. పెళ్లి తర్వాత ఇంత ఫ్రీడమ్ ఉంటుందా ఉండగా అనేది నేను చెప్పలేను. అలాంటప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు? పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లికి వ్యతిరేకం. ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని నేను నమ్ముతాను. అదే టైమ్ లో అభిప్రాయబేధాలొస్తే విడాకులు తీసుకోవడం కూడా ఉత్తమమని నేను భావిస్తాను. ఇష్టం లేకుండా కలిసుండే జీవితం నాకొద్దు."

ఇలా పెళ్లి-విడాకులపై స్పందించింది సదా. ఇక ప్రేమ విషయానికొస్తే.. ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నానని, మరికొన్నాళ్లు సోలో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. ఈ బ్యూటీ సినిమాల కంటే విహార యాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సమయం దొరికిన ప్రతిసారి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.

ఓవైపు సినిమాలతో పాటు, మరోవైపు వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. మంచి పాత్ర దొరికితే చాలని, అది పాజిటివ్ లేదా నెగెటివ్ అనేది తను చూడనంటోంది. తేజ దర్శకత్వం వహించిన అహింస సినిమాలో మంచి పాత్ర పోషించింది సదా.

First Published:  19 Jun 2024 8:28 AM IST
Next Story