Actress Pragathi | రెండో పెళ్లి పుకార్లు ఖండించిన సీనియర్ నటి
Actress Pragathi 2nd marriage rumours | తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన కథనాల్ని నటి ప్రగతి ఖండించారు. ఆధారాలు లేకుండా ఎలా రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Actress Pragathi 2nd marriage rumours | టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం మొదలైంది. ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను ఆమె రెండో పెళ్లి చేసుకుంటోందంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థలో కథనం వచ్చింది. దీనిపై ప్రగతి సీరియస్ అయ్యారు. ఆ వార్తా కథనాన్ని పూర్తిగా ఖండించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా తను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు ప్రగతి. ఇన్నాళ్లూ సదరు మీడియా సంస్థపై తనకున్న గౌరవం మొత్తం పోయిందన్నారు. సంస్థలో ఎవరో నిద్రపోయి, కలగని తనపై ఇలా అవాస్తవాలు రాసినట్టున్నారంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
సినిమా వాళ్లపై పుకార్లు సృష్టించి, ఏదో ఒకటి రాసేస్తే ఎవ్వరూ ప్రశ్నించరనే ఆలోచనతో కొంతమంది ఉన్నారని, తనపై రాసిన కథనం మొత్తం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. జర్నలిజం విలువలు పాటించాలని, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించిన ప్రగతి, మరో వ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే హక్కు ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ప్రగతి. ఆమె సింగిల్ మదర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. తను శారీరంగా దృఢంగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేస్తానని తెలిపిన ప్రగతి, మానసికంగా కూడా దృఢంగా ఉంటానని, అవాస్తవ కథనాలు తనను ప్రభావితం చేయవని గతంలోనే ప్రకటించారు.