Telugu Global
Cinema & Entertainment

Vishal: విశాల్ తో ప్రేమ..పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అభినయ

Vishal: అయితే ఈ వార్తలపై నటి అభినయ తాజాగా స్పందించింది. తాను, విశాల్ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు అన్ని రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేసింది.

Vishal: విశాల్ తో ప్రేమ..పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అభినయ
X

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, నటి అభినయ ప్రేమలో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. త్వరలో వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్, అభినయ ప్రస్తుతం మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై నటి అభినయ తాజాగా స్పందించింది. తాను, విశాల్ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు అన్ని రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేసింది. తాను మార్క్ ఆంటోనీ సినిమాలో విశాల్ భార్యగా నటిస్తున్నట్లు తెలిపారు. వెండి తెరపై భార్యగా నటించినంతమాత్రాన నిజజీవితంలో భార్యాభర్తలం కాగలమా? అని ఆమె ప్రశ్నించింది. అభినయ ఇచ్చిన క్లారిటీతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే ప్రచారానికి తెరపడింది.

కాగా విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ కొన్నేళ్ళకు ముందు ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే కోలీవుడ్లో నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ వరలక్ష్మి తండ్రి అయిన శరత్ కుమార్ తో పోటీ పడాల్సి రావడంతో విశాల్ వరలక్ష్మి మధ్య దూరం పెరిగిందన్న టాక్ ఉంది. ఆ తర్వాత విశాల్ హైదరాబాద్ కు చెందిన అనీషా అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత దానిని రద్దు చేసుకున్నారు.

First Published:  31 Oct 2022 12:47 PM IST
Next Story