Vishal Marriage: ప్రభాస్ పెళ్లి తర్వాతే.. నా పెళ్లి - మీడియా ప్రశ్నకు హీరో విశాల్ ఫన్నీ రియాక్షన్
Vishal Marriage: తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్.. ఇటీవల తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించాడు. పెళ్లి చేసుకోవాలని తనకు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా వర్క్ లైఫ్పైనే ఉందని చెప్పాడు. పెళ్లి అనేది జోక్ కాదని.. ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని తెలిపాడు.
`పందెం కోడి`తో ప్రేక్షకులకు పసందైన వినోదాల విందు అందించిన హీరో విశాల్.. తాజాగా `లాఠీ` సినిమాతో అభిమానులకు మరోసారి అదిరిపోయే యాక్షన్ థ్రిల్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లోని యాక్షన్ అంశాలు.. ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూసేలా ఈ ట్రైలర్ను రూపొందించారు.
ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ లాగానే.. హీరో విశాల్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే.. ఆయన పెళ్లిపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా తన కో స్టార్ అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవబోతున్నారని వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ.. తాను నడిగర్ సంఘ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఈ భవన నిర్మాణం 2019లో ప్రారంభించగా, ఇప్పుడు తుది దశకు చేరుకోనున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్.. ఇటీవల తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించాడు. పెళ్లి చేసుకోవాలని తనకు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా వర్క్ లైఫ్పైనే ఉందని చెప్పాడు. పెళ్లి అనేది జోక్ కాదని.. ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని తెలిపాడు. వృత్తి జీవితం పట్ల ఎంత నిబద్ధతతో ఉంటామో.. వ్యక్తిగత జీవితంలోనూ అలాగే ఉండాలని చెప్పాడు. ప్రస్తుతం నటుడిగా తనకెన్నో బాధ్యతలు ఉన్నాయని, వాటిని నిర్వర్తిస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన్ని.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారా.. అని ప్రశ్నించగా.. ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా సమాధానమిచ్చారు.