Telugu Global
Cinema & Entertainment

వేడుకగా నటుడు నారా రోహిత్‌ నిశ్చితార్థం

'ప్రతినిధి 2' హీరోయిన్‌ సిరీ లెల్లతో ఆయన పెళ్లి జరగనున్నది. ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌కు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, భవనేశ్వరి దంపతులు

వేడుకగా నటుడు నారా రోహిత్‌ నిశ్చితార్థం
X

నటుడు నారా రోహిత్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. 'ప్రతినిధి 2' హీరోయిన్‌ సిరీ లెల్లతో ఆయన పెళ్లి జరగనున్నది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, భవనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు విషెస్‌ చెప్పారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారచడంతో నెటీజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రోహిత్‌ ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్ముర్తి నాయుడు కుమారుడు. బాణం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అయ్యాడు. యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన సోలో మూవీతో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో,, అసుర, జో అచ్చుతానంద వంటి సినిమాల్లో నటించారు. 2018లో విడుదలైన వీర భోగ వసంత రాయులు తర్వాత సుమారు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ప్రతినిధి 2 విడుదలైంది. ఈ మూసీ షూటింగ్‌ సమయంలోనే నటి సిరీతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహ బంధంలోకి అడుపెడుతున్నారు.

First Published:  13 Oct 2024 8:13 AM GMT
Next Story